లాఠీ చేతబట్టనున్న శ్రీరెడ్డి

By iQlikMovies - August 25, 2018 - 12:02 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు ఇండస్ట్రీ సినీ ప్రముఖులపై అసభ్యకరమైన ఆరోపణలతో బజారుకెక్కి, పాపులర్‌ అయిపోదామనుకున్న శ్రీరెడ్డి అనుకున్నదొక్కటి. అయినది ఒక్కటి..' అనేలా ఏదో ఊహిస్తే ఇంకేదో జరిగింది. ఎప్పటికో అప్పటికి అయినా అరా కొరా అవకాశాలు వచ్చే ఛాన్స్‌ని ఈ లీకుల ఎపిసోడ్‌తో పూర్తిగా కోల్పోయింది. 

తర్వాత టాలీవుడ్‌లో పని కాలేదని, కోలీవుడ్‌పై కూడా విరుడచుకుపడింది. అక్కడ కూడా అమ్మడి పప్పులు ఉడకలేదు. అయితే తాజాగా శ్రీరెడ్డి బయోపిక్‌ తెరకెక్కబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ బయోపిక్‌ని ఆమె స్వయంగా రూపొందిస్తోందట అని కూడా టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అయితే అదంతా ఉత్తదే. 

కానీ శ్రీరెడ్డి అయితే ఓ సినిమాలో నటిస్తోంది. 'రెడ్డీ డెయిరీ సినిమా పేరు. అయితే ఇది బయోపిక్‌ కాదు. తెలుగు సినిమా అంతకన్నా కాదు. ఓ తమిళ సినిమా. అందులో శ్రీరెడ్డి కూడా నటిస్తోంది. అంతేకానీ ఆమె మెయిన్‌ రోల్‌ కాదు. ఓ క్యారెక్టర్‌ పోషిస్తోందంతే. మెయిన్‌ రోల్‌ వేరే వాళ్లది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఈ సినిమాలో శ్రీరెడ్డికి చాన్స్‌ దక్కింది. 

ఛాన్స్‌ అయితే దక్కింది కానీ, సినిమాలో ఆమె నటించి, సినిమా రిలీజ్‌ అయ్యేదాకా గ్యారంటీ లేని వ్యవహారమిది. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌లో తనకి ఛాన్స్‌ అని గతంలో ప్రచారం చేసుకుంది. అయితే ఆ సినిమాలో శ్రీరెడ్డికీ ఛాన్స్‌ లేకుండా పోయింది. తేజకీ ఛాన్స్‌ లేకుండా పోయింది. అదీ సంగతి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS