చిరు.. మ‌హేష్‌.. ఇద్ద‌రిలో ఎవ‌రు..??

By iQlikMovies - April 13, 2018 - 08:01 AM IST

మరిన్ని వార్తలు

రంగ‌స్థ‌లంతో సుకుమార్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆర్య త‌ర‌వాత‌.. యూనానిమ‌స్‌గా హిట్ టాక్ పొందిన సినిమా ఇదే. మ‌ధ్య‌లో సుకుమార్‌కి చాలా విజ‌యాలొచ్చాయి, కానీ... ఇంత పెద్ద విజ‌యం ఆయ‌న కెరీర్‌లోనే చూడ‌లేదు. అందుకే సుకుమార్ డిమాండ్ అమాంతం పెరిగిపోయిందిప్పుడు. సుక్కుతో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద హీరోలు సైతం ఆరాట ప‌డుతున్నారు. ఈలోగా సుకుమార్ త‌దుప‌రి సినిమాపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ కోసం సుకుమార్ ఓ క‌థ సిద్ధం చేసుకున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అది నిజం కాద‌ని తేలిపోయింది.  ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోల పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

సుకుమార్ - చిరంజీవి కాంబోకి రంగం సిద్ధ‌మైంద‌ని టాలీవుడ్ టాక్‌. అంతేకాదు.. సుకుమార్, మ‌హేష్‌లు మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేస్తార‌ని చెప్పుకుంటున్నారు. సుకుమార్‌కి చిరంజీవితో ఓ సినిమా చేయాల‌న్న‌ది క‌ల‌. కాక‌పోతే.. ఇప్ప‌ట్లో అది నెర‌వేరే అవ‌కాశాలు లేవు. ఎందుకంటే చిరుకి స‌రిప‌డ క‌థ సుకుమార్ ద‌గ్గ‌ర రెడీగా లేదు. ఉన్నా చిరంజీవి చేయ‌డం క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం సైరాతో బిజీ. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఉంటుంది. ఇవి రెండూ పూర్త‌య్యాక చిరంజీవి మూడ్ ఎలా ఉంటుందో చెప్ప‌లేం. అందుకే చిరు - సుకుమార్ కాంబో ఇప్ప‌ట్లో లేన‌ట్టే.

మ‌హేష్ బాబు విష‌యానికొస్తే... సుకుమార్‌తో సినిమా సెట్ట‌య్యే ఛాన్స్ సూప‌ర్ స్టార్‌కే ఉంది. ఎందుకంటే భ‌ర‌త్ అనే నేను సినిమా పూర్త‌య్యింది. ఆ వెంట‌నే.. వంశీ పైడిప‌ల్లి సినిమా మొద‌ల‌వుతుంది. ఈ యేడాది చివ‌రిక‌ల్లా అది పూర్త‌యిపోతుంది. ఈలోగా మ‌హేష్ కోసం సుకుమార్ క‌థ రెడీ చేసేయొచ్చు. రంగ‌స్థ‌లం చూశాక‌.. సుకుమార్‌ని క‌ల‌సి ప్ర‌త్యేకంగా మాట్లాడాడు మ‌హేష్‌. సినిమా విష‌యంపై కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయి. సో... సుకుమార్ త‌దుప‌రి సినిమా మ‌హేష్‌తో అని ఫిక్స‌యిపోవొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS