అరే శంకర్‌: శ్రీరెడ్డి వార్నింగ్‌

By iQlikMovies - July 05, 2018 - 12:06 PM IST

మరిన్ని వార్తలు

షకలక శంకర్‌ పవన్‌ కళ్యాణ్‌కి అభిమాని. అభిమాని మాత్రమే కాదు, భక్తుడు కూడా. ఓ ఇంటర్వ్యూలో అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. అంతేకాదు, ఇంకా చాలా చాలా చెప్పాడు. ఇదంతా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తాను పడ్డ పాట్లు గురించి చెప్పాడు. 

'హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కమెడియన్‌గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఆ అవకాశం రావడానికే చాలా చాలా టైం పట్టింది. చాలా చాలా కష్టాల్ని ఓర్చాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు హీరోగా సినిమా ఛాన్స్‌ దక్కింది. ఎదురు చూడాలి కానీ, అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా..' అనే సందర్భంలో షకలక శంకర్‌ ఈ పదాన్ని వాడాల్సి వచ్చింది. 

అయితే గుమ్మడికాయల దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు, రోడ్డున పడలేం కదా.. అన్న ఒక్క మాట పట్టుకుని నన్నే అంటావా.! నువ్వు.. అని నటి శ్రీరెడ్డి షకలక శంకర్‌పై ఫైర్‌ అవుతూ ఓ వీడియోని పోస్ట్‌ చేసింది. 

ఓ హీరోని భుజానికెత్తుకుని, నీ ఫ్లాప్‌ సినిమా కోసం పనికిమాలిన పబ్లిసిటీ చేస్తున్నావ్‌. చేసుకుంటే చేసుకో కానీ, నా జోలికి వస్తే పళ్లు రాలగొడతాను. 'ఏమే' అంటావా నన్ను.. నీలా నేను ఏ హీరోనీ భుజానికెత్తుకోను.. అని షకలక శంకర్‌పై శ్రీరెడ్డి ఫైర్‌ అయిన వీడియో వైరల్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS