తెలుగు చిత్రసీమ పద్ధతులు కొన్ని వివాదాస్పదం అవుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న గుండు హనుమంతరావు చనిపోతే... పట్టించుకున్న నాధుడు లేడు. కనీసం సంతాప సభ కూడా నిర్వహించలేదు.
సరికదా, గుండు చనిపోయిన మరుసటి రోజు ఫిల్మ్‌ఛాంబర్‌లో కె.విశ్వనాథ్‌పుట్టిన రోజు జరుపుకుని వివాదాస్పదం చేసుకున్నారు. ఇప్పుడు శ్రీదేవి విషయంలోనూ అదే తంతు. శ్రీదేవి టాలీవుడ్‌లో నెంబర్ వన్ హోదాని ఓ దశాబ్దం పాటు కాపాడుకున్న మేటి నాయిక. దాదాపుగా అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. అలాంటి శ్రీదేవి మరణం కూడా తెలుగు చిత్రసీమ కళ్లు తెరిపించలేకపోయింది. శ్రీదేవి చనిపోయి వారం కావొస్తున్నా ఒక్క సంతాప సభ కూడా నిర్వహించలేదు.
ఈ స్థాయి నటీమణి చనిపోతే మూడు రోజుల పాటు షూటింగులకు బంద్ ప్రకటిస్తారు. అది ఎలాగూ చేయలేదు. కనీసం సంతాప సభ అయినా నిర్వహించాల్సింది కదా? ఆదివారం పార్క్ హయత్‌లో సంతాప సభ పెట్టారు. అయితే.. అది సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే... చిత్రసీమకు చెందిన పైసా కూడా దీనికి ఖర్చు పెట్టరన్నమాట.
మా ఆధ్వర్యంలో, లేదంటే యావత్ చలన చిత్రసీమ ఆధ్వర్యంలోనే జరగాల్సిన సంతాప సభ... ఓ వ్యక్తి చేస్తున్నాడన్నమాట. శ్రీదేవికి ఇచ్చే గౌరవం ఇదేనా..??