నానికి కోపమొస్తే అంతే మరి..!

మరిన్ని వార్తలు

సెలబ్రిటీలన్నాక వారి చుట్టూ ఏవో గాసిప్స్‌, రూమర్స్‌ స్ప్రెడ్‌ అవుతూ ఉంటాయి. అది మామూలే. అయితే ఒక్కోసారి ఆ గాసిప్స్‌కి మన ప్రియమైన సెలబ్రిటీలు ఘాటుగా స్పందించాల్సి ఉంటుంది కూడా. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని విషయంలో కూడా అదే జరిగింది. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు నాని. స్క్రీన్‌పై చాలా సరదా సరదాగా కనిపిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. అలాంటి నానికి కోపం రాదా? అనుకుంటే పొరపాటే. మనోడికి కోపం కొంచెం ఎక్కువేనండోయ్‌. తాజాగా నానిపై ఓ మీడియా సంస్థ ఓ వార్త ప్రచురించింది. ఆ వార్తకి మన నానికి చాలా కోపమే వచ్చింది.

ఇంతకీ నానిని అలా కోపానికి గురి చేసిన ఆ వార్త ఏంటయ్యా అంటే, నాని అట ఈ మధ్య యాక్షన్‌ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాడట. అందుకే తాను నటించే సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండాలని దర్శకులకు సూచిస్తున్నాడట. అదీ సంగతి. ఈ విషయాన్నే సదరు మీడియా సంస్థ ప్రచురించింది. అంతేకాదు, ఈ వార్తను సోషల్‌ మీడియాలో కూడా పోస్ట్‌ చేసి, నానికి ట్యాగ్‌ చేసింది. అందుకే ఇలాంటి విషయాలు రాసేటప్పుడు నన్ను ట్యాగ్‌ చేయకండి ప్లీజ్‌.. అంటూ కొంచెం సున్నితంగా ఇంకొంచెం గౌరవంగానే నాని చెప్పాడు. అయినా నానికి హీరో కాకముందే దర్శకత్వ విభాగంలోనూ అనుభవం ఉంది.

అయినా కానీ తన సినిమాల్లో డైరెక్షన్‌లో అస్సలు జోక్యం చేసుకోడు నాని. అందుకే నానితో సినిమాలు చేయడం అంటే చాలా సౌకర్యంగా ఉంటుంది అని చాలా మంది డైరెక్టర్లు చెబుతూ ఉంటారు. అలా కాబట్టే నాని ఏడాదికి మూడు సినిమాలతో వస్తూ, హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతున్నాడు కూడా. మరి అలాంటి నానిపై ఇలాంటి రూమర్స్‌ పుట్టించడం అంటే బాధాకరమే. అందుకే మన నానికి అంత కోపమొచ్చింది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS