'ఎన్‌టిఆర్‌'లో శ్రీదేవే హైలైట్‌ అట

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'. 2019 జనవరిలో 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు' పేర్లతో రెండు పార్టులుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలో అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రీదేవి పాత్రలో కన్పించనున్న సంగతి తెల్సిందే. శ్రీదేవి పాత్రే ఈ సినిమాకి గ్లామర్‌ పరంగా హైలైట్‌ కాబోతోందని సమాచారమ్‌. రకుల్‌ టాలీవుడ్‌లో లీడింగ్‌ హీరోయిన్లలో ఒకరు. అలాంటి రకుల్‌, బిజీ షెడ్యూల్స్‌ని పక్కన పెట్టి 'ఎన్‌టిఆర్‌' సినిమాలో గెస్ట్‌ రోల్‌ మాత్రమే చేస్తుందని ఎలా అనుకోగలం? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శ్రీదేవి పాత్ర సినిమాలో ఎక్కువగానే వుంటుందని తెలుస్తోంది. 

కేవలం ఓ పాటలో మాత్రమే శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కన్పించబోతోందని ఇప్పటిదాకా ప్రచారం జరిగిన సంగతి తెల్సిందే. త్వరలో శ్రీదేవి పాత్రకు సంబంధించి ఓ మేకింగ్‌ వీడియో విడుదల చేసేందుకు 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' టీమ్‌ సమాయత్తమవుతోందట. ఇదిలా వుంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సతీమణిగా నటిస్తోంది విద్యాబాలన్‌. ఆమె పాత్ర నిడివి తక్కువే వుంటుందని తెలుస్తోంది. 

చంద్రబాబు పాత్రధారి రానాకి కూడా స్కోప్‌ తక్కువే వుంటుందని సమాచారమ్‌. మరోపక్క హరికృష్ణ పాత్ర నిడివి కొంచెం ఎక్కువే వుంటుందట. మరి, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడక తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS