‘వి’ టీజర్‌ రివ్యూ: నాని అదరగొట్టేశాడంతే!

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని విలనిజం ఎలా వుంటుందో టీజర్‌ ఇప్పటికే చూసేశాం ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో. కాస్సేపు నెగెటివ్‌ షేడ్‌లో కన్పిస్తాడు నాని ఆ సినిమాలో. అయితే, ఈసారి ఫుల్‌ లెంగ్త్‌ నెగెటివ్‌ రోల్‌లో నానిని చూడబోతున్నాం. ఈసారి కూడా ఇంద్రగంటి మోహన్‌కృష్ణనే ఆ బాధ్యత తీసుకున్నాడు ‘వి’ సినిమా కోసం. సుధీర్‌ బాబు ఈ సినిమాలో పోలీస్‌ గెటప్‌లో కన్పిస్తోంటే, నాని విలనిజంతో అదరగొట్టేసినట్లే కన్పిస్తోంది. ‘వి’ సినిమా టీజర్‌ని కాస్సేపటి క్రితమే విడుదల చేశారు. టీజర్‌ స్టార్ట్‌ అయినప్పటినుంచీ ఎండ్‌ అయ్యేవరకు అస్సలేమాత్రం చూపు తిప్పుకోలేం. అంత ఇంట్రెస్టింగ్‌గా టీజర్‌ని తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అయితే, టీజర్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. టెక్నికల్‌ అంశాలకి నటీ నటుల పెర్ఫామెన్స్‌ అదనపు బలాన్నిచ్చింది. సుధీర్‌ బాబు పోలీస్‌ గెటప్‌లో చూపించిన ఆటిట్యూడ్‌ అదుర్స్‌.

ఇక, నాని విలనిజం అయితే ఇంకో లెవల్‌లో కన్పిస్తుంది. చివర్లో ‘సోది ఆపు, దమ్ముంటే నన్ను ఆపు’ అని నాని చెప్పే డైలాగ్‌కి బీభత్సమైన రెస్పాన్స్‌ వస్తోంది. ‘ఫూల్స్‌ మాత్రమే రూల్స్‌ గుడ్డిగా ఫాలో అవుతారు’ అంటూ సుధీర్‌ బాబు చెప్పే డైలాగ్‌తో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. ‘న్యాయాన్నీ ధర్మాన్నీ కాపాడడానికి నువ్వొస్తున్నావనగానే విజిల్స్‌ వేయడానికి నేనేమీ నా ఫ్యాన్‌ని కాదు’ అని నాని చెప్పే డైలాగ్‌కి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ ది¸యేటర్లలో చూడబోతున్నాం. ఓవరాల్‌గా టీజర్‌ సినిమాపై అంచనాల్ని అమాంతం పదింతలు పెంచేసేలా వుంది. మార్చి 25న ‘వి’ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS