శ్రీకాంత్‌ రాజకీయం మళ్లీ మొదలైంది.!

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్‌ ఉన్న శ్రీకాంత్‌ 'ఆపరేషన్‌ ధుర్యోధన' చిత్రంతో పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఉన్న బోల్డ్‌ కంటెన్ట్‌ మూవీలో నటించి, ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా కాస్త వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పొలిటికల్‌ ఆపరేషన్‌కి మరోసారి సిద్ధమయ్యాడు శ్రీకాంత్‌. 

'ఆపరేషన్‌ 2019' అనే టైటిల్‌తో శ్రీకాంత్‌ నటిస్తున్న ఓ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో యజ్ఞాశెట్టి, దీక్షాపంథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు కూడా. ఇకపోతే 2019 ఎలక్షన్స్‌ నేపథ్యంలో పొలిటికల్‌ మూవీస్‌కి ప్రాధాన్యత దక్కుతోంది. అందరి కన్నా ముందు సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న 'నోటా'పై భారీ అంచనాలున్నాయి. వివాదాల పరంగానూ, కలెక్షన్స్‌ పరంగా కూడా విజయ్‌ దేవరకొండ సినిమా అంటే సెన్సేషనే. 

మరి ఈ తరుణంలో శ్రీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్‌ 2019' ఎంత మేర ఆకట్టుకోగలదో. కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఖచ్చితంగా ఓ పొలిటికల్‌ అడ్వెంచర్‌ అవుతుందనీ చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అయితే ఈ మధ్య శ్రీకాంత్‌కి హీరోగా పెద్దగా డిమాండ్‌ లేదు. నాగచైతన్య నటించిన 'యుద్ధం శరణం' సినిమాలో విలన్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయేసరికి శ్రీకాంత్‌ విలనిజంని ఎవ్వరూ పెద్దగా లెక్క చేయలేదు. 

మరి తాజాగా శ్రీకాంత్‌ చేయబోయే ఆపరేషన్‌లో విజయం ఎంతమేర ఆయన్ని వరిస్తుందో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS