దయ్యంతో ఆటాడుకుందాం రా

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్‌కి మంచి పేరుంది. సెంటిమెంట్‌ పండించడంలోనూ, కామెడీ క్రియేట్‌ చేయడంలో కూడా శ్రీకాంత్‌ నటన ఆకట్టుకుంటుంది. అలాగే యాక్షన్‌ కటౌట్‌ కూడా. కానీ ఈ మధ్య శ్రీకాంత్‌ చేస్తున్న సినిమాలు పెద్దగా ప్రాచుర్యంలోకి రావడం లేదు. అందుకే విలక్షణత వైపు శ్రీకాంత్‌ కూడా దృష్టి పెట్టాడు. హారర్‌ బెస్‌డ్‌ కామెడీ చిత్రాలకు ఆదరణ బాగా దక్కుతున్న ప్రస్తుత నేపధ్యంలో శ్రీకాంత్‌ కూడా అదే సబ్జెక్ట్‌ని టచ్‌ చేసి నేను కూడా భయపెడతానంటున్నాడు. అయితే శ్రీకాంత్‌ భయపెట్టేది డిఫరెంట్‌గా ఉంటుందట. దయ్యాన్ని చూసి మనోడు భయపడడంట. మనల్ని కూడా పెద్దగా భయపెట్టనంటున్నాడు. అయితే దయ్యంతో సరదాగా ఆటాడుకుంటాను. అప్పుడు మీరు హాయిగా నవ్వుకుందురు గానీ అంటున్నాడు ఈ హ్యాండ్‌సమ్‌ హీరో శ్రీకాంత్‌. శ్రీకాంత్‌, నాజియా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'రా..రా..'. ఈ చిత్రం విజి చెర్రీస్‌ యూనిట్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ విడుదలయ్యింది. మంచి స్పందన అందుకుంటోంది. త్వరలోనే టీజర్‌ విడుదల కానుంది. ఈ టీజర్‌ని చాలా స్పెషల్‌గా రూపొందించనున్నారట. ఆలీ, పోసాని పండించే వినోదంతో పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వడం ఖాయం అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS