నిధి అద్దాలు పగలగొట్టిన శ్రీముఖి.

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ టాస్క్‌లో భాగంగా, నిధిని కాపాడాల్సిన బాధ్యత ఊరి జనాలది. ఆ నిధిని ఎలాగైనా కొట్టేయాలని చూస్తారు దొంగల క్యారెక్టర్‌లో ఉన్న శ్రీముఖి, అషూ రెడ్డి, రవికృష్ణ. అయితే, నిధిని కొట్టేసే యత్నంలో నిధి అద్దాలు పగలగొట్టేయాలని డిసైడ్‌ అవుతుంది శ్రీముఖి. ఈ ప్లాన్‌ నిజంగా హర్షించదగ్గది కాదు. ఎందుకంటే, అద్దం పగలగొట్టడమనేది డేంజర్‌ ఇష్యూ. తనతో పాటు, మిగిలిన వారికీ గాయాలయ్యే ప్రమాదముంది. అయితే, ఆలోచన చేసిన శ్రీముఖి, తన సేఫ్టీ తాను మాత్రం చూసుకుంది. హౌస్‌మేట్స్‌ని డేంజర్‌లో పడేసింది.

 

తన చేతికి బలంగా క్లాత్‌ చుట్టుకుని, జిమ్‌ ఏరియాలోని డంబెల్‌ దొంగిలించి, నిధి వద్ద కాపు కాసింది. అప్పటికే నిధి చుట్టూ, ఊరి జనం క్యారెక్టర్స్‌లో ఉన్న మిగిలిన హౌస్‌మేట్స్‌ అంతా నిధి చుట్టూ సెక్యూరిటీగా నిలబడ్డారు. అదును చూసుకుని డంబెల్‌ సాయంతో నిధి అద్దాలు పగలగొట్టింది శ్రీముఖి. ఆ క్రమంలో రవికృష్ణ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హఠాత్పరిణామానికి హౌస్‌మేట్స్‌ అంతా షాక్‌కి గురయ్యారు. కాస్సేపటికి తేరుకుని, శ్రీముఖిపై మాటలతో ఎటాక్‌ చేశారు.

 

ఈ ఎపిసోడ్‌ అంతా టీవీలో వీక్షించిన ప్రేక్షకులు కూడా షాక్‌ అయ్యారు. ఈ ఎపిసోడ్‌లో శ్రీముఖినే తప్పు పడుతున్నారు. టాస్క్‌లో గాయపడిన రవికృష్ణను మెడికల్‌ రూమ్‌కి తీసుకెళ్లి బిగ్‌బాస్‌ చికిత్స అందించారు. ఫిజికల్‌ టాస్క్‌లో ఇలాంటి వైపరీత్యాల్ని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ముందుగానే ఊహించిన, కాస్త ఆచి తూచి వ్యవహరించాలని ఆడియన్స్‌ భావిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS