ఇటీవల విడుదలైన కన్నడ సినిమా 'కేజీఎఫ్'తో ప్రేక్షకుల నోళ్లలో తెగ మెదిలిన హీరోయిన్ పేరు శ్రీనిధి శెట్టి. కన్నడ సినిమా అయినప్పటికీ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వచ్చిన హైప్‌తో అస్సలు ఆలస్యం చేయకుండా, వెంటనే 'కేజీఎఫ్ 2' అంటూ సీక్వెల్‌ని పట్టాలెక్కించేశారు చిత్ర యూనిట్. 'బాహుబలి' రేంజ్‌లో దక్కించుకున్న వీరాభిమానానికి 'కేజీఎఫ్ 2'పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాదు, మొదటి పార్ట్‌కి అనూహ్యంగా వచ్చిన రెస్పాన్స్‌తో భారీ బడ్జెట్‌తో సెకండ్ పార్ట్ రూపొందిస్తున్నారు. ఇకపోతే హీరోయిన్ శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే, 'కేజీఎఫ్' తెచ్చిన క్రేజ్‌తో ఈ భామకు తెలుగు, తమిళ భాషల్లో భారీ ఆఫర్లు తలుపు తట్టాయట. కానీ కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఆ ఆఫర్స్‌ని సున్నితంగా తిరస్కరించిందట. అయితే డెబ్యూ భామలు కెరీర్ కొత్తల్లో, కాస్త కష్టమే అయినా వచ్చిన ప్రతీ ఆఫర్‌ని చేజిక్కించుకోవాలి. వన్స్ ఆఫర్ మిస్సయ్యిందంటే మళ్లీ దక్కడం బహు కష్టం.
అయినా క్రేజ్ ఉన్నప్పుడే హీరోయిన్లు సద్వినియోగం చేసుకోవాలి. ఇంతా చేసి, 'కేజీఎఫ్ 2' రిజల్ట్ ఏమైనా బెడిసి కొట్టిందా.? ఇటు ఉన్నదీ పోయే, ఉంచుకున్నదీ పోయే అన్న చందంగా వచ్చిన ఆఫర్లూ పోయినట్లు అవుతుంది. ఇక రావల్సిన ఆఫర్లూ వెనక్కి పోతాయ్. మరి ఈ చిన్న లాజిక్‌ని ఈ భామ ఎందుకు మిస్ అయ్యిందో కానీ, అమ్మడు చేసిన త్యాగానికి ఆశ్చర్యపోవడం తప్ప, మరో అర్ధం బోధపడడం లేదు సినీ ప్రియులకి.