రాజమౌళి సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

దర్శకుడు రాజమౌళి ఏం మాట్లాడినా అది సంచలనమే. ఆయన సినిమాలు సృష్టించే సంచలనాల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే వున్నాం. ఇంతకీ, ఒక్క ఫ్లాప్‌ కూడా లేకుండా సంచలనాల మీద సంచలనాలు సృష్టించడం రాజమౌళికి ఎలా సాధ్యమవుతోంది.? ఇదే ప్రశ్నని ఆయన ముందుకు తీసుకొస్తే, ‘గత సినిమా రిజల్ట్‌ని అస్సలేమాత్రం మైండ్‌లో పెట్టుకోకుండా, ప్రతి కొత్త సినిమాకీ కొత్త కొత్తగా కస్టపడటమే నా సక్సెస్‌ సీక్రెట్‌ అయి వుంటుందేమో..’ అని అభిప్రాయపడ్డాడీ జక్కన్న. నిజమే, రాజమౌళి ఎప్పుడూ సక్సెస్‌ తాలూకు గర్వాన్ని తలకెక్కించుకోడు. అదే ఆయన ప్రత్యేకత. మాట చాలా పద్ధతిగా, పొదుపుగా వుంటుంటుంది. గాల్లో దీపం పెట్టే కబుర్లు చెప్పడు.. ఆకాశానికి అసలే నిచ్చెన వేయడు. తన సినిమాపై పూర్తి నమ్మకంతో వుంటాడు.

 

తన సినిమానే మాట్లాడుతుందనే భావన బహుశా రాజమౌళికే చెల్లుతుందేమో. అయితే, ముందు ముందు భారీ చిత్రాల విషయంలో కొన్ని ఇబ్బందులుంటాయనే సంకేతాలు మాత్రం ఆయన ఇచ్చేశాడు. దానిక్కారణం కరోనా వైరస్‌. ‘జీవితం మునుపటిలా వుండకపోవచ్చు. పెద్ద సినిమాల బడ్జెట్‌లు తగ్గొచ్చు.. అలాగని, ది¸యేటర్లకు ప్రేక్షకులు రాకుండా వుండరు..’ అని రాజమౌళి తాజాగా వ్యాఖ్యానించాడు. అదీ నిజమే. జీవితం మునుపటిలా వుండనే వుండదు. కరోనా వైరస్‌కి ముందు, కరోనా వైరస్‌ తర్వాత.! ఇదే వాస్తవం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS