షాకింగ్‌: మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి సినిమా ఆగిపోయిందా?

By Gowthami - February 22, 2020 - 13:33 PM IST

మరిన్ని వార్తలు

మ‌హ‌ర్షి త‌ర‌వాత మ‌రోసారి వంశీ పైడిప‌ల్లికి ఛాన్స్ ఇచ్చాడు మ‌హేష్ బాబు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌ర‌వాత ప‌ట్టాలెక్కాల్సిన మ‌హేష్ సినిమా ఇదే. ఇప్ప‌టికే మ‌హేష్‌కి క‌థ వినిపించ‌డం జ‌రిగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింద‌ని తెలుస్తోంది. క‌థ విష‌యంలో మ‌హేష్ అసంతృప్తితో ఉన్నాడ‌ని, అందుకే ఈ సినిమాని వ‌దులుకోవాల్సివ‌స్తోంద‌ని తెలుస్తోంది. మార్చి నెలాఖ‌రున లాంఛ‌నంగా ప్రారంభించి, మేలో ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని చూశారు. అయితే.. ఇప్పుడు ఈ స్థానంలో మ‌రో సినిమాని మొద‌లెట్టాల‌ని మ‌హేష్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

 

మ‌హేష్ కోసం వంశీ పైడిప‌ల్లి ఓ మాఫియా క‌థ‌ని ఎంచుకున్నాడు. అయితే ఆ క‌థ ఇప్పుడు మ‌హేష్‌కి అసంపూర్తిగా అనిపిస్తోంద‌ట‌. వ‌రుసగా విజ‌యాలు సాధిస్తున్న ఈ త‌రుణంలో ఒక్క చిన్న త‌ప్పు కూడా చేయ‌కూడ‌ద‌ని మ‌హేష్ భావించ‌డం వ‌ల్లే ఈ క‌థ‌ని ప‌క్క‌న పెట్టేశార‌ని తెలుస్తోంది. వంశీ పైడిప‌ల్లి కూడా మ‌హేష్‌కి శ‌త‌విధాలా న‌చ్చ‌జెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని, కానీ మ‌హేష్ మాట విన‌డం లేద‌ని, దాంతో ఈ క‌థ‌ని మ‌రో హీరోతో తీయాల‌ని వంశీ పైడిప‌ల్లి ఫిక్స‌య్యాడ‌ని స‌మాచారం. సో... ఇప్పుడు మ‌హేష్‌కి ఓ ద‌ర్శ‌కుడు, వంశీకి ఓ హీరో కావాలన్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS