‘ఛలో’ మూవీతో రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసి, గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఫస్ట్ మూవీ అయినా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. మారు ఆలోచించకుండా తన రెండో సినిమాకీ రష్మికనే హీరోయిన్‌గా ఎంచుకుని, లేటెస్ట్‌గా ‘భీష్మ’తో ద్వితీయ విఘ్నం లేకుండా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ డైరెక్టర్ వంతొచ్చింది. ఆయన మరెవరో కాదు, రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వెంకీ అయితే, ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్‌గా రష్మిక చెలామణీ అయ్యేందుకు కారణమైన డైరెక్టర్ పరశురాం. ‘గీత గోవిందం’ సినిమాతో రష్మిక స్టారే మారిపోయేలా చేశాడు ఈ డైరెక్టర్. అయితే, ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదింతవరకూ పరశురాం.
ఇక ఇప్పుడే అక్కినేని హీరో నాగచైతన్యతో పరశురాం ఓ క్యూట్ లవ్ స్టోరీకి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో రష్మికను ఇన్వాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే, ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రష్మికను దించబోతున్నాడన్న మాట. ప్రస్తుతం ‘భీష్మ’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, మరోవైపు అల్లు అర్జున్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది రష్మిక. ఈ లోగా పరశురాం ఆఫర్‌ని స్వీకరిస్తే, ఆమె ఖాతాలో మరో కొత్త ప్రాజెక్ట్ జాయిన్ అయినట్లే. అలాగే అదృష్ట దేవత రష్మిక ఓకే అరటే పరశురాంకీ పండగే. అయినా పరశురాం కోరితే, రష్మిక కాదంటుందా.? చెప్పండి. సో ఆల్‌మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లే అంటున్నారు. ఇక ప్రస్తుతం చైతూ ‘లవ్‌స్టోరీ’ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.