సంక్రాంతి, దసరాకు తెలుగు చిత్రాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశం పై ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ రాసింది. దసరా, సంక్రాంతి పండగ రోజుల్లో తెలుగు సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో తెలుగుతోపాటు తమిళ హీరోల సినిమాలు విడుదలకానున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్, అసోసియేషన్‌కు సూచించింది. ఈ విషయమై 2017లో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసింది.
చిరంజీవి వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ 2023 సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. వీటితోపాటు తమిళ చిత్రాలు విజయ్ వారసుడు , అజిత్ ‘తునివు' కుడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2017లో నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ సినిమాలకు కాకుండా తెలుగు సినిమాలకే ప్రధాన్యత వుండాలని తన నిర్ణయం చెప్పారు. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న వారసుడు డబ్బింగ్ సినిమాగా పండగకి విడుదలౌతుంది. దీంతో దిల్ రాజు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేఖపై దిల్ రాజు పత్రికా ముఖంగా స్పందించలేదు. వారసుడు సంక్రాంతికే వస్తుందని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. మరి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచనపై ఆయన స్పందన ఎలా వుంటుందో చూడాలి.