2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ టేకింగ్, పూజా తమన్ అందించిన పాటలు .. ఇవన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా పాటలైతే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ.. ఒకదానికి మించి ఒకటి అలరించాయి. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ తమన్ మరోసారి కలిశారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ దుబాయిలో ప్రారంభమయ్యాయి. మహేష్, త్రివిక్రమ్, తమన్ .. ముగ్గురూ దుబాయ్ లోని కొన్ని రోజులు గడిపి ట్యూన్స్ ని ఫైనల్ చేస్తారు. ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా దుబాయ్ లోనే జరిగాయి. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ ని ఫాలోఅవుతున్నారు త్రివిక్రమ్.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక.