త్రివిక్రమ్ కి `అ` సెంటిమెంట్ ఒకటి గట్టిగా ఉంది. అతడు, అఆ. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో.. ఇలా `అ` సెంటిమెంట్ ని చాలాసార్లు కొనసాగించాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి `పార్థూ` అనే టైటిల్ ఫిక్సయ్యిందని వార్తలొస్తున్నాయి. ఈ కథకి పార్థూ అనే టైటిలే పర్‌ఫెక్ట్ అట. అయితే అది `అ`తో మొదలవ్వడం లేదు. అందుకే ఇక్కడ తెలివిగా ఆ టైటిల్ ని కాస్త మార్చాడు త్రివిక్రముడు.
`అతడే పార్థూ` అంటూ.. దాన్ని పొడిగించి, `అ` సెంటిమెంట్ కి న్యాయం చేశాడు. ఈ సినిమాకి ఈ టైటిలే ఖరారైందన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ - త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి ఇదే టైటిల్ ఆనాటి పోస్టర్ పై కనిపిస్తుందా, లేదా? అనేది తెలియాంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.