'సైరా'లో నయన్‌ కన్నా తమన్నాకే స్పేస్‌ ఎక్కువ. ఎలాగో తెలుసా!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో తమన్నాకిచ్చిన మాట గుర్తుపెట్టుకుని 'సైరా నరసింహారెడ్డి'లో తన పక్కన నటించే ఛాన్స్‌ ఇచ్చాడు చిరంజీవి. అయితే, ఈ సినిమాలో తమన్నాది జస్ట్‌ గెస్ట్‌ రోల్‌ మాత్రమే.. మెయిన్‌ హీరోయిన్‌ అయిన నయనతారకే ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఉంటుందట అనుకున్నారంతా. కానీ, లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే, ఇద్దరి పాత్రలూ పోటా పోటీగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి సరి కదా.. నయనతార పాత్ర కన్నా, తమన్నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కూడా అనిపిస్తోంది.

 

పెద్ద పెద్ద దుప్పట్టా పట్టుకుని ఎగరేస్తూ ఏవో విన్యాసాలు చేస్తోంది తమన్నా. అది చూస్తుంటే, 'అరుంధతి' సినిమాలో అనుష్క చేసే యాక్షన్‌ సీన్‌, 'పద్మావత్‌' సినిమాలో దీపికా పడుకునే' గుర్తుకొస్తోంది. అంటే తమన్నా పాత్రకు చాలా చాలా ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తోంది. తమన్నా గెస్ట్‌ రోల్‌ కాదు, పక్కా హీరోయిన్‌ పాత్రే అనిపిస్తోంది. 'లక్ష్మీ అనే నా పేరుకు ముందు 'నరసింహా' అనే మీ పేరుకు చోటివ్వండి చాలు..' అనే డైలాగ్‌ తమన్నా క్యారెక్టర్‌ని ఎలివేట్‌ చేస్తోంది. అంతే కాదు, ప్రత్యేకమైన ఓ యాక్షన్‌ ఘట్టాన్ని కూడా తమన్నాపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎలాగూ నయనతార ప్రమోషన్స్‌కి దూరం కాబట్టి, అక్కడ కూడా తమన్నానే హైలైట్‌ అవుతుంది.

 

'బాహుబలి' తర్వాత తమన్నా కెరీర్‌లో 'సైరా' మరో మంచి మూవీ అవుతుందనడం అతిశయోక్తి కాదు. ఫామ్‌లో లేదనుకుంటునే, 'ఎఫ్‌ 2'తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేసిన తమన్నాకి 'సైరా'తో మరోసారి దశ తిరిగిపోతుందేమో. 'సైరా' బ్లాక్‌ బస్టర్‌ కొడుతుందా.? లేదా.? అనేది తర్వాతి సంగతి. ఇలాంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌లో కనిపించినా అది ఘనతే. అలాంటిది తమన్నా పాత్రకు దక్కిన ప్రాధాన్యతతో 'సైరా' ఆమె కెరీర్‌లో మరో మైలు రాయిగా నిలిచిపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS