'స్టైల్ 2'లో.... బ‌న్నీ, చ‌ర‌ణ్, తార‌క్‌

By iQlikMovies - April 18, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

డాన్స్ మాస్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న లారెన్స్‌ని ద‌ర్శ‌కుడిగా మార్చిన సినిమా 'స్టైల్‌'.  డాన్స్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లో దానికి అగ్ర‌తాంబూలం ఇవ్వొచ్చు. ఇప్పుడు 'స్టైల్ 2' కూడా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని లారెన్స్ ధృవీక‌రించాడు కూడా. ''స్టైల్ 2 తీద్దామ‌ని నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ అంటున్నారు. ఆ సినిమా తీయాలంటే మంచి డాన్స‌ర్లు కావాలి. తెలుగులో బ‌న్నీ డాన్సులు బాగా చేస్తాడు. చ‌ర‌ణ్ మంచి డాన్స‌ర్‌. తార‌క్ కూడా డాన్సులు బాగా చేస్తున్నాడు. వీళ్ల‌తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది'' అన్నాడు లారెన్స్‌.

లారెన్స్ ఆలోచ‌న బాగుంది. కాక‌పోతే.. స్టైల్ 2ని మ‌ల్టీస్టార‌ర్‌గా తీస్తే ఇంకా బాగుంటుందేమో.  ఎన్టీఆర్ - చ‌ర‌ణ్‌లు ఆల్రెడీ న‌టిస్తున్నారు కాబ‌ట్టి.. చ‌ర‌ణ్ - బ‌న్నీల‌తో ఈ ప్రాజెక్టు చేస్తే వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 'ఎవడు' వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పూర్తి స్థాయి మ‌ల్టీస్టార‌ర్‌లో క‌ల‌సి న‌టించాల‌ని చ‌ర‌ణ్‌, బ‌న్నీ ఆశ‌గా ఉన్నారు. లారెన్స్ క‌థ సిద్ధం చేస్తే గ‌నుక‌... ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్‌ని చూసే అవ‌కాశం ద‌క్కుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS