తెలుగమ్మాయ్‌ ఈ సారైనా కొడుతుందా.?

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయ్‌ ఈషా రెబ్బకు ఇంకా సరైన బ్రేక్‌ రావడం లేదు. మంచి ఆఫర్లే దక్కించుకుంటున్నా అసలు సిసలు బ్రేక్‌ వచ్చింది లేదింతవరకూ. తాజాగా ఈ బ్యూటీ సోలో హీరోయిన్‌గా అక్కినేని మేనల్లుడు సుమంత్‌కి జోడీగా నటిస్తోంది. 

'సుబ్రహ్మణ్యపురం' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆకట్టుకునే థ్రిల్లింగ్‌ అండ్‌ సస్పెన్స్‌ అంశాలతో రూపొందుతోంది. ఇన్ని సినిమాల్లో తన పాత్రలన్నీ ఒకెత్తు. ఈ సినిమాలో ఈషా పాత్ర మరో ఎత్తు అనిపించేలా ఉంటుందట. నటిగా తనని ఇంకో మెట్టు పైకెక్కేలా చేసే పాత్ర 'సుబ్రహ్మణ్యపురం' సినిమాలో చూస్తారని ఈషా చెబుతోంది. 

ఇటీవలే ఈషా 'బ్రాండ్‌ బాబు' అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఓకే అనిపించినా, ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో 'అరవింద సమేత' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది ఈషా రెబ్బ. స్టార్‌ హీరో, పెద్ద మూవీ అయినా 'అరవింద సమేత' ఈషా కెరీర్‌కి పెద్దగా కలిసొచ్చింది లేదు. కానీ సినిమాలో చిన్న, పెద్ద అనే తేడా ఏముంది. కథలో కంటెన్ట్‌ ఉండాలి. పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కాలి. అలాంటి పాత్ర దక్కితే నిడివితో పని లేదు. స్టార్‌డమ్‌తో అంతకన్నా పని లేదు క్రేజ్‌ సంపాదించడానికి. 

చూడాలి మరి ఈషా చెబుతున్నట్లు 'సుబ్రహ్మణ్యపురం' ఆమె కెరీర్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టే సినిమా అవుతుందేమో మరి.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS