ఈవారం విడుదలైన సినిమాల్లో శాకిని - డానికి ఒకటి. రెజీనా, నివేదా థామస్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం కొరియన్ డ్రామా `మిడ్‌నైట్ రన్నర్స్`కి అఫీషియల్ రీమేక్. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకొంది. ఈ క్రెడిట్స్ నుంచి.. తప్పించుకోగలిగాడు దర్శకుడు సుధీర్ వర్మ.
శాకిని - డానికిని సుధీర్ వర్మనే దర్శకుడు. కాకపోతే.. సినిమా అంతా అయిపోయాక.. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిపోయాడు. ప్రమోషన్లలో ఎక్కడా కనిపించలేదు. దానికీ కారణం ఉంది.
ఈ సినిమాలో కొన్ని సీన్లు మరో దర్శకుడు ఆనంద్ రంగాతో రీషూట్లు చేయించారు. అది....సుధీర్ వర్మకు నచ్చలేదు. పైగా మేకింగ్ లో తనకు ఫ్రీ హ్యాంగ్ ఇవ్వలేదన్నది సుధీర్ వర్మ ఆరోపణ. అందుకే ఈ సినిమా ప్రమోషన్లలో సుధీర్ పాల్గొనలేదు. పైగా `ఈ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేదు` అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. దాంతో... ఈ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ సుధీర్ వర్మపై పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం సుధీర్ వర్మ రవితేజతో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.