జబర్‌దస్త్‌తో చాలామంది హాస్య నటులు వెలుగులోకి వచ్చారు. కానీ అదేం దురదృష్టమో ఏమో... ఎవ్వనూ వెండితెరపై సక్సెస్ అవ్వలేదు. ఆఖరికి సుడిగాలి సుధీర్ తో సహా. సుడిగాలి సుధీర్ హీరోగా రెండు సినిమాలు చేశాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాల్లో హీరోగా నటించాడు. రెండు సినిమాలూ ఫ్లాపులే. కానీ సుధీర్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. `ఇక మీదటా హీరోగానే చేస్తా` అంటున్నాడట. కొన్ని సినిమాల్లో సుధీర్‌కి కామెడీ పాత్రలు వచ్చాయి. కానీ వాటిని సుధీర్ ఒప్పుకోవడం లేదు.
నేను హీరోగా వెండి తెరపై అడుగుపెట్టా. ఇక మీదటా హీరోగానే చేస్తా.. అలాంటి పాత్రలు వచ్చే వరకూ ఎదురు చూస్తా అంటున్నాడట. బుల్లి తెరపైనా కామెడీ చేసి, వెండి తెరపైనా అదే చేయడం తనకు నచ్చలేదని, నిజానికి టీవీ రంగంలో తనకు క్షణం కూడా ఖాళీ ఉండడం లేదని, అవన్నీ పక్కన పెట్టి సినిమా చేయాలంటే బలమైన పాత్ర ఉండాలి కదా అంటున్నాడట. హైపర్ ఆది లాంటి వాళ్లు ఇది వరకు బాగానే హాస్య పాత్రలు సంపాదించారు. కానీ.. వాటిని నిలబెట్టుకోలేదు. హాస్య పాత్రలు వస్తే చాల్లే అని జబర్ దస్త్ నటులంతా ఎదురుచూస్తుంటే, సుధీర్ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తున్నాడు.