సినిమా ప్రపంచం ఒక రంగుల కల. ఎవరి కలలకి ఎప్పుడు రంగులు అద్దుకుంటాయో, ఎవరి కలలు ఎప్పుడు కళావిహీనం అవుతాయో చెప్పలేము. ఒక్కోసారి ఎంత కష్ట పడినా ఫలితం ఉండదు. ఒక్కొక్కరికి లక్ కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. వీటిలో సుహాస్ ఏ రకానికి చెందడు. ఎందుకంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోలేదు. అలా అని తనకి గుర్తింపు లభించకుండా పోలేదు. అతని ప్రతి కష్టానికి ఫలితం దక్కింది. మొదట షార్ట్ ఫిలిమ్స్ తో జర్నీ సార్ట్ చేసి కమెడియన్ గా, సపోర్ట్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ, చేసిన ప్రతి పాత్రకి గుర్తింపు తెచ్చుకుని , కలర్ ఫొటో సినిమాతో హీరో అయ్యాడు. అక్కడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నెక్స్ట్ హీరోగా వచ్చిన సినిమాలన్నీ పరవాలేదు అనిపించుకున్నాయి రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.
అంబాజీ పేట హిట్ తో చిన్న నిర్మాతలకి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు సుహాస్. ఈ ఏడాది సుహాస్ ఏకంగా ఏడు సినిమాలతో వస్తున్నాడు అంటే మాములు విషయం కాదు. అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రముఖ OTT సంస్థ సుహాస్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యింది. ఉప్పు కప్పురంబు అనే క్రేజీ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కీర్తి సురేష్ తో కలిసి ఈ మూవీలో సుహాస్ నటించనున్నాడు. ఇది కాక ఇంకో ఆరు సినిమాలు సుహాస్ చేతిలో ఉన్నాయి. తనకి వచ్చిన గుర్తింపుని, పేరుని, దుర్వినియోగం చేయకుండా హార్డ్ వర్క్ చేస్తున్నాడు సుహాస్.
ఉప్పు కప్పురంబు సినిమాతో పాటు శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, జనక అయితే గనక, గొర్రె పురాణం, ఆనందరావు అడ్వెంచర్స్, కేబుల్ రెడ్డి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీస్ అన్ని 2024 లోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. అంటే నెలల వ్యవధిలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సుహాస్ కి ఫ్యాన్స్ కూడా పెరుగుతున్నారు. సుహాస్ ఇదే జోరు కొనసాగిస్తూ విజయ పథంలో నడిస్తే ఒక కమెడియన్ హీరోగా మారి సక్సెస్ అయినవాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రజంట్ సుహాస్ రెమ్యునరేషన్ రెండున్నర నుంచి 3 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఫ్యూచర్ లో పాన్ ఇండియా హీరోగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదు.