స్టోరీని రన్ చేయడంలో ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో ప్రత్యేకత. సహజంగానే ప్రతీ డైరెక్టర్. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ఆశక్తికరంగా కనెక్ట్ చేయాలనుకుంటాడు. అలాగే తేజ కూడా భావిస్తాడు. కానీ, తేజలో ఒకే ఒక స్పెషల్ ఉంది. టైటిల్‌ని ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వదులుతాడు. అంటే దీనర్ధం సినిమాలో అసలు సిసలు విషయం అక్కడి నుండే స్టార్ట్ అవుతుందనుకోవాలో లేక, టైటిల్‌కి ఈ సినిమా పర్‌ఫెక్ట్ యాప్ట్ ఎందుకంటే.. సెకండాఫ్ చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది.. ఒకవేళ ఫస్టాఫ్ బోర్ కొట్టినా, విసిగిపోకుండా ధియేటర్స్ నుండి వెళ్లిపోకండి అన్నట్లుగా అనుకోవాలో తెలీదు.
కానీ, తేజ స్టైల్ అది అంతే. అయితే తాను ఎందుకు ఆ స్టైల్‌ని ఇంత స్టైలిష్‌గా ఫాలో చేస్తాడో ఆశక్తికరమైన రీజన్ ఒకటి చెప్పాడు తాజాగా తేజ. ఇంతకీ ఆ రీజన్ ఏంటంటే, సినిమా హిట్ అనిపిస్తే, అక్కడే విషయం తెలుస్తుందనీ, ఒకవేళ ఫట్ అయినా అక్కడే తెలిసిపోతుంది.. అనే టఫ్ వివరణ ఒకటి ఇచ్చాడు తేజ. ఏది ఏమైతేనేం ఎవరి స్టైల్ వారిది. తప్పు పట్టడానికి ఏమీ లేదిందులో. ఇకపోతే, మన తేజగారి దర్శకత్వంలో వస్తున్న 'సీత' సినిమా రిలీజ్‌కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ సందర్భంగా చేస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా తేజ ఇలాంటి తాజా తాజా వివరణలు ఇస్తూ, సినిమాపై ఆశక్తి కలిగేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.