సోగ్గాడి ముందు బెల్లీ డాన్స్‌ ఇరగదీసేసిన రాములమ్మ!

By Inkmantra - October 10, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

శ్రీముఖి మంచి డాన్సర్‌ అని తెలిసిందే. అయితే, బిగ్‌బాస్‌ తాజా ఎపిసోడ్‌లో శ్రీముఖి వేసిన బెల్లీ డాన్స్‌ వీక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. శ్రీముఖి డాన్స్‌కి హౌస్‌మేట్స్‌తో పాటు, ఆడియన్స్‌ కూడా ఫిదా అయిపోయారు. అంత అందంగా బెల్లీ డాన్స్‌ చేసింది హౌస్‌లో శ్రీముఖి. దసరా సందర్భంగా సోగ్గాడు హోస్ట్‌ నాగార్జున హౌస్‌లోకి వెళ్లి, హౌస్‌ మేట్స్‌కి సర్‌ప్రైజ్‌ చేశారు. అంతకు ముందు ఫుడ్‌ మేళా టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌ ప్రిపేర్‌ చేసిన వంటకాల్ని టేస్ట్‌ చేసి, పండగ సందర్భంగా వారికి కొన్ని సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్స్‌ కూడా అందించారు.

 

అంతేకాదు, నాగార్జున హౌస్‌లో ఉన్నంతసేపూ, సందడి వాతావరణం కనిపించింది. రకరకాల టాస్క్‌లు ఇచ్చి హౌస్‌మేట్స్‌ తో పర్‌ఫామెన్స్‌ చేయించి ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచేశారు. అందులో భాగంగానే మహేష్‌ వంతుగా వచ్చిన బెల్లీ డాన్స్‌, శ్రీముఖికి షిఫ్ట్‌ చేశాడు నాగార్జున. నాకు బెల్లీ డాన్స్‌ రాదు సార్‌.. అని నాగ్‌తో కాసేపు గారాలు పోయిన శ్రీముఖి, రంగంలోకి దిగగానే దుమ్ము రేపేసింది. శ్రీముఖిలో ఇంత మంచి బెల్లీ డాన్సర్‌ ఉందా.? అని ఆశ్చర్యపోయేంతలా ఆమె పర్‌ఫామెన్స్‌తో కట్టి పడేసింది. అలా పండగ రోజు సోగ్గాడి ముందు బెల్లీ డాన్స్‌ ఇరగదీసేసింది రాములమ్మ శ్రీముఖి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS