'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'కి సుకుమార్ కాంప్లిమెంట్స్‌

మరిన్ని వార్తలు

ఈ శుక్ర‌వారం విడుద‌లైన సినిమాల్లో 'ఫ‌ల‌క్‌నుమాదాస్‌' ఒక‌టి. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి మంచి వ‌సూళ్లే ద‌క్కుతున్నాయి. దాంతో పాటు విశ్వ‌క్ సేన్ తీసుకొస్తున్న నెగిటీవ్ ప‌బ్లిసిటీ ఈ సినిమాకి బాగానే హెల్ప్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకి సుకుమార్ కాంప్లిమెంట్స్ అందాయి.

 

సుక్కు ఈ సినిమా చూశాడ‌ట‌. త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, హైద‌రాబాద్ సంస్క్కృతిని కొత్త‌గా చూపించార‌ని కితాబులు ఇచ్చేశాడు. హైద‌రాబాద్ సంస్క్కృతి వింత‌గా, కొత్త‌గా ఉంటుంద‌ని, దాన్ని జ‌గ‌డంలో చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాన‌ని, కానీ కుద‌ర్లేద‌ని - ఈ సినిమాలో మాత్రం అది బాగా క‌నిపించింద‌ని ప్ర‌శంసించాడు.

 

ద‌ర్శ‌కుడిగా ఇదే తొలి ప్ర‌య‌త్నం అయినా విశ్వ‌క్ బాగా చేశాడ‌ని, కొత్త‌వాళ్ల‌తో అనుకున్న అవుట్‌పుట్ రాబ‌ట్టుకున్నాడ‌ని, చిన్న‌పిల్ల‌ల‌తో చెప్పించిన సంభాష‌ణ‌లు కూడా బాగున్నాయ‌ని, సినిమా మొత్తం స‌హ‌జంగా ఉంద‌ని ఈ టీమ్‌ని మెచ్చుకున్నాడు సుకుమార్‌. సున్నిత‌మైన చిత్రాలు, మైండ్ గేమ్‌ల‌తో సినిమాలు తీసే క్లాస్ ద‌ర్శ‌కుడు సుకుమార్‌కి కూడా ఈ సినిమా న‌చ్చిందంటే - విశేష‌మే అనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS