ఏజెంట్‌ ఆత్రేయ'కి సుకుమార్‌ ప్రశంసలు

మరిన్ని వార్తలు

స్టార్‌ డైరెక్టర్‌ అయినా సుకుమార్‌ చిన్న సినిమాలను ప్రశంసించడంలో ముందుంటాడు. ఈ మధ్య విశ్వక్సేన్‌ హీరోగా తెరకెక్కిన 'ఫలక్‌నుమా దాస్‌' సినిమానీ సుకుమార్‌ ప్రశంసలతో ముంచెత్తేసిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ ప్రశంసించడంతో ఆ సినిమాలో విషయముందని ఆడియన్స్‌కి అర్ధమైంది. దాంతో సినిమాకి మంచి ఆదరణ కూడా దక్కింది. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్‌ 'ఏజెంట్‌ ఆత్రేయ' దక్కించుకున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ' సినిమాపై సుకుమార్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

 

సినిమా చూశాననీ, చాలా బాగుందనీ, నవీన్‌ నటన ఆకట్టుకునేలా ఉందనీ ఈ సినిమా కోసం పని చేసిన టీమ్‌ అందర్నీ ప్రశంసలతో ముంచెత్తేశాడు సుకుమార్‌. 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత సుకుమార్‌ నుండి సినిమా రాలేదింతవరకూ. స్టోరీలు సిద్ధం చేసుకున్నా, సుకుమార్‌తో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు ఖాళీగా లేరు. దాంతో సుకుమార్‌ తదుపరి ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. వాస్తవానికి సుకుమార్‌ - మహేష్‌బాబు కాంబో మూవీ స్టార్ట్‌ అవ్వాల్సి ఉంది.

 

కానీ, మహేష్‌ - అనిల్‌తో డీల్‌ కుదుర్చుకోవడంతో ఈ కాంబో వెనక్కి వెళ్లింది. మహేష్‌ ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌ వచ్చాడు. కానీ, అల్లు అర్జున్‌ ప్రస్తుతం 'అలకనంద' సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకూ ఇంకా టైం పడుతుంది. సో ఈ లోగా సుకుమార్‌ ఖాళీగా ఉండకుండా, చిన్న సినిమాలను ఎంకరేజ్‌ చేయడంలో తన వంతు ఉత్సాహం చూపిస్తున్నాడు. సుకుమార్‌ ప్రశంసలతో ఆయా చిన్న సినిమాలకు అనుకోకుండా హైప్‌ పెరుగుతున్నట్లవుతోంది. అలాగే ఇప్పుడు 'ఏజెంట్‌ ఆత్రేయ'కీ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS