ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది సైరా. హిందీలో సైరా అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయినా తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఓ ఊపు ఊపేస్తోంది. సైరాకి ధీటుగా పెద్ద సినిమాలేవీ రాకపోవడం, వచ్చిన సినిమాలు కూడా నిలబడకపోవడంతో సైరా దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలి 12 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల షేర్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా 99.5 కోట్లు వచ్చాయి.
ఓవర్సీస్‌లో రూ.13 కోట్ల లెక్క తేలింది. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా కలిపి 7.6 కోట్లు వచ్చాయి. కర్నాటకలో 15 కోట్ల వరకూ రాబట్టింది. నైజాంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించుకుంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకి నైజాంలో 31 కోట్లు వచ్చాయి. సీడెడ్‌లో బ్రేక్ ఈవెన్ రావడానికి మరో 2 కోట్లు చేయాల్సివుంది. అక్కడ ఈ సినిమాకి 20 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకూ 18 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాని 18 కోట్లకు కొన్నారు. అక్కడ 13 కోట్లు మాత్రమే రావడం బయ్యర్లను నిరాశ పరిచింది.