స్టేజ్ పై అందరినీ హుషారుగా పరిచయం చేసే సుమ గురించి మళ్ళీ కొత్త పరిచయం అవరసం లేదు. స్టార్ మహిళ సుమ. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెర టాప్ యాంకర్ కొనసాగుతుంది. ఏ పెద్ద హీరో సినిమా వేడుక జరిగినా సుమ ఉండాల్సిందే. స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఇప్పుడు వెండితెర ఎంట్రీ ఇస్తుంది సుమ. సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ , పోస్టర్ రామ్ చరణ్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి 'జయమ్మ పంచాయితీ అనే టైటిల్ పెట్టారు. ఇక పోస్టర్ కూడా సీరియస్ గా వుంది. సుమ చీర కొంగులో ఒక పంచాయితీ మొత్తం వున్న పోస్టర్ డిజైన్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి విజయ్ కుమార్ దర్శకుడు. సుమకి వెండితెర కొత్త కాదు. ఆమె ప్రయాణం మొదలైయింది సినిమాతోనే. 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది సుమ. తర్వాత కొన్ని సినిమాలు చేసింది. తర్వాత పూర్తిగా బుల్లితెరకి షిఫ్ట్ అయిపొయింది. ఇప్పుడు మళ్ళీ వెండితెరపైపు అడుగు వేసింది. ఈ సినిమాకి కీరవాణీ మ్యూజిక్ అందించడం మరో విశేషం.