అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ కూడా ఒకరు. అయితే ఇటీవలి కాలంలో సుమంత్ నుంచి సరైన సినిమా రాలేదు. ఈసారెలాగైనా హిట్ కొడ్తానంటూ విలక్షణ కథలు ఎంచుకుంటున్నా, వచ్చిన సినిమా వచ్చినట్లే నిరాశపరుస్తోంది.
సుమంత్‌లో ప్రయత్న లోపం లేకపోయినా, ఆయా సినిమాలు సుమంత్‌ని డైలమాలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెగెటివ్ రోల్స్ వైపు సుమంత్ దృష్టిపెట్టాడని సమాచారమ్. తాజాగా సుమంత్ తన కొత్త సినిమా కోసం కంప్లీట్‌గా గడ్డం, మీసం తీసేశాడు. క్లీన్ షేవ్‌తో సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేస్తూ, అది తన తదుపరి సినిమా కోసమని చెప్పాడు.
ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. విలనిజం చూపించడమంటే, ఆ సినిమాలో ఇంకో హీరో వుండాల్సిన పనిలేదు. విలన్ సెంట్రిక్ సినిమాలు మన టాలీవుడ్‌కి కాస్త కొత్తే. అతనే విలన్, అతనే హీరో అనే తరహా కథాంశంతో సుమంత్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకి సుమంత్ ఓకే చెప్పాడనీ, తెలుగు సినీ పరిశ్రమలోనే ఇదో కొత్త ప్రయోగమనీ ఇన్‌సైడ్ సోర్సెస్ వెల్లడిస్తున్నాయి.
ఆ వివరాలేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.