సినిమా మేకింగ్ లో త్రివిక్రమ్ కి ఓ స్టైల్ ఉంది. చిన్న పాత్రనైనా.. పేరున్న నటీనటులతో చేయించాలనుకుంటాడు. తద్వారా ఆయా పాత్రలకు మరింత వెయిటేజీ వస్తుంటుంది. అందుకే త్రివిక్రమ్ సినిమా అనగానే భారీ తారాగణం కనిపిస్తుంటుంది. అల వైకుంఠపురములో..నే తీసుకోండి. టబు దగ్గర్నుంచి, సుశాంత్ వరకూ.. ప్రతీ పాత్రకూ పేరున్నవాళ్లే కనిపిస్తారు.
ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు త్రివిక్రమ్. త్వరలోనే మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈనెల 31న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం.. శిల్పాశెట్టిని ఎంచుకుంటున్నార్ట. మరో పాత్ర కోసం సుమంత్ ని తీసుకోవాలని భావిస్తున్నార్ట. మహేష్ కి అత్తగా శిల్ప.. బావగా సుమంత్ కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి అక్కినేని హీరోల్ని వాడుకుని, ఆ హిట్ సెంటిమెంట్ ని కొనసాగించాలనుకుంటున్నాడన్నమాట. అన్నట్టు ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే దాదాపుగా ఖాయమైపోయిందని టాక్.