తడిసి ముద్దవుతున్న సుమంత్‌

మరిన్ని వార్తలు

సినిమా ప్రమోషన్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. సినీ పరిశ్రమలో స్నేహ పూర్వక వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతోంది. ఓ సినిమాకి ఇతర హీరోల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే అది ఆహ్వానించదగ్గ విషయమే కదా. 'సుబ్రహ్మణ్యపురం' సినిమా అలా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసల్ని విడుదలకు ముందే అందుకుంటుండడంతో హీరో సుమంత్‌, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

 

ఈ స్థాయిలో తనపైనా, తన సినిమాపైనా ప్రశంసల వర్షం ముందే కురుస్తుండడం చాలా ఆనందంగా వుందంటున్నాడు అక్కినేని కాంపౌండ్‌కి చెందిన ఈ హీరో. సుమంత్‌, ఈషా కలిసి నటించిన 'సుబ్రమ్మణ్యపురం' ట్రైలర్‌ విడుదలయ్యింది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే ట్రైలర్‌ చాలా బావుంది. ఓ ఊరిలో, ఓ గుడిలో జరిగే వింతలు, విశేషాల సమాహారమే 'సుబ్రహ్మణ్యపురం'. దేవుడి మీద నమ్మకం లేని ఓ యువకుడికీ, దేవుడ్ని బలంగా నమ్మే ఆ ఊరికీ మధ్య సంఘర్షణ ఈ సినిమా. ఈ తరహా సినిమాలు గతంలో కొన్ని వచ్చినా, అన్నిటిలోకీ ఇది చాలా భిన్నమైనదని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. 

'సుబ్రహ్మణ్యపురం' సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణకు అక్కినేని హీరో అఖిల్‌ హాజరయ్యాడు. 'సుబ్రహ్మణ్యపురం' టీమ్‌కి బెస్ట్‌ విషెస్‌ అందించాడు. మరోపక్క నాగార్జున, నాని.. ఇలా పలువురు హీరోలు సుమంత్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు సోషల్‌ మీడియా వేదికగా. ఇదిలా వుంటే ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. 

ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తోంటే, సినిమాకి పాజిటివ్‌ వైబ్స్‌ కన్పిస్తున్నట్లేనని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS