సందీప్ కిష‌న్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

మరిన్ని వార్తలు

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'. లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.

 

`ఏ 1 ఎక్స్‌ప్రెస్` ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లో సందీప్ కిష‌న్ ఎయిట్ ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ ప‌ట్టుకుని మ‌రో చేతితో త‌న చొక్కాని స్టేడియంలో ఊపుతున్న‌ట్లు చూపించారు. విజయం యొక్క ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ కి ఇది ప‌ర్‌ఫెక్ట్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్.

 

ఈ పోస్ట‌ర్‌కి `గేమ్ బిగిన్స్ ఇన్ థియేట‌ర్స్ సూన్‌` అనే క్యాప్ష‌న్‌ను జోడించారు. త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సందీప్ కిష‌న్ 25వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రం ప‌ట్ల‌ ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేస్తున్నారు. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపుపొందిన ఈ మూవీలో హిప్ హాప్ తమిళ స్వ‌రాలు కూర్చిన `సింగిల్ కింగులం` పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS