పాపం.! సందీప్‌ కిషన్‌ బ్యాచిలర్‌ పాట్లు చూశారా?

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరోల్లో హిట్‌ కోసం తెగ పాట్లు పడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. పట్టు వదలని విక్రమార్కుడిలా మనోడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు హిట్టు కోసం. కానీ, ఏం చేస్తాం.. ఎప్పటికప్పుడే హిట్టు వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది. ఇక ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ సారి ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్‌’ అంటూ స్పోర్ట్స్‌ డ్రామాతో వస్తున్నాడు. ఈ సినిమా నుండి రిలీజైన లేటెస్ట్‌ ఆడియో సింగిల్‌తో మనోడు నెట్టింట్లో వైరల్‌ అయ్యాడు. ఇంతకీ ఆ ఆడియో సింగిల్‌ కథా కమామిషు ఏంటంటే, ‘సింగిల్‌ కింగులం..’ అంటూ సాగే ఈ ఆడియో సింగిల్‌ లిరిక్స్‌లో బ్యాచిలర్‌ పాట్లు ఫన్నీ ట్యూన్స్‌లో వినిపించారు. దాంతో ఆ ఆడియోని బ్యాచిలర్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈ పాటలకు రాహుల్‌ సిప్లిగంజ్‌ వాయిస్‌ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ ఇంట్రెస్టింగ్‌ సాంగ్‌కి హిప్‌ హాప్‌ తమీజా మ్యూజిక్‌ అందించారు. డెన్నిస్‌ జీవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరే, ఆడియో సింగిల్‌తో బాగానే వైరల్‌ అయ్యాడు కానీ, మన ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్‌’ అంటూ గ్రేస్‌ ఫుల్‌ టైటిల్‌తో వస్తున్న మన సందీప్‌కి ఈ సారైనా హిట్‌ దక్కుతుందా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS