`నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
మురళీశర్మ, రఘుబాబు, సందీప్ కిషన్‌లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. అలాగే ఈ జోనర్‌లో సందీప్ కిషన్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.