కుర్రాడికి ఈసారైనా హిట్టొస్తుందా?

మరిన్ని వార్తలు

టాలెంట్‌ వున్నోడేగానీ, సరైన సినిమా పడటంలేదు. హీరోగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు సక్సెస్‌ కోసం.. అలా చేస్తున్న ప్రయత్నాలేవీ అతనికి హిట్‌ ఇవ్వకపోవడంతో డీలా పడిపోవాల్సి వస్తోంది. ఆ యంగ్‌ హీరో ఇంకెవరో కాదు, సందీప్‌ కిషన్‌. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో సంచలన విజయాన్ని అందుకున్న సందీప్‌ కిషన్‌, ఆ తర్వాత మళ్ళీ అలాంటి విజయాన్ని అందుకోవడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నాడు. 

తాజాగా సందీప్‌ కిషన్‌ నుంచి ఓ సినిమా లుక్‌ ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అదే 'నిను వీడని నీడను నేనే'. సందీప్‌ కిషన్‌, అన్య సింగ్‌ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు. ఇదొక థ్రిల్లర్‌ మూవీ. ఫస్ట్‌ లుక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు ఈ ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయిందంటూ సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ చిత్రంతో నిర్మాతగానూ సందీప్‌ కిషన్‌ మారుతుండడం గమనార్హం. 

నిర్మాతగా మారిన సందీప్‌ కిషన్‌కి అభినందనలంటూ తమన్నా, కాజల్‌, మెహ్రీన్‌ తదితర హీరోయిన్లు విషెస్‌ అందిస్తున్నారు. యంగ్‌ హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అలా మారిన వారిలో కొందరు సక్సెస్‌ అయ్యారు కూడా. తనకు తొలి విజయాన్నిచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'లోని 'వెంకటాద్రి' పేరుని తీసుకుని, వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా చేస్తున్నాడు సందీప్‌ కిషన్‌. 

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS