ప్రయోగాల బాట పట్టిన సందీప్‌ కిషన్‌

మరిన్ని వార్తలు

నేచురల్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్నప్పటికీ, హీరోగా స్టార్‌డమ్‌ సంపాదించుకోలేకపోతున్నాడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. పక్కింటబ్బాయిలా కనిపించే సందీప్‌ కిషన్‌కి సరైన బ్రేక్‌ రావడం లేదు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' వంటి కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ హిట్స్‌ తన ఖాతాలో ఉన్నప్పటికీ, అది ఏమాత్రం చాలదు. 

లేటెస్టుగా సూపర్‌స్టార్‌ సోదరి మంజుల దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సందీప్‌ కిషన్‌కి ఆ సినిమా రిజల్ట్‌ రివర్స్‌ కొట్టడంతో రేసులోకి ఎంటర్‌ కాలేకపోయాడు. ఎక్కువగా బైలింగ్వల్‌ మూవీస్‌లో నటించే సందీప్‌ కిషన్‌ తమిళంలో నటించిన 'నరగాసురన్‌' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ లోగా ఓ కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశాడు మనోడు. ఈ సారి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాతో కాకుండా, కొంచెం డిఫరెంట్‌ సినిమాతో వస్తున్నాడు సందీప్‌ కిషన్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందీ సినిమా. తమిళ దర్శకుడు కార్తీక్‌రాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఒళ్లు గగుర్పొడిచే హారర్‌ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయట. తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ గుండె ఝళ్లుమనిపించేలా ఉండబోతోందట. ఇలా ఒక్కటేమిటి ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలున్నాయంటున్నాడు సందీప్‌ కిషన్‌. 

ఈ సినిమాలో సందీప్‌కి జోడీగా నటించే ముద్దుగుమ్మ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు కానీ, ఈ సినిమాతో డిఫరెంట్‌ జోనర్‌ని ఎంచుకునే ఆలోచన చేసిన సందీప్‌ కిషన్‌కి ఈ రకంగానైనా చెప్పుకోదగ్గ సక్సెస్‌ అందుతుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS