ఇటీవలే `తెనాలి రామకృష్ణ`గా సందడి చేశాడు సందీప్‌కిషన్. `ఏ1` అనే సినిమాని త్వరలో పట్టాలెక్కించబోతున్నాడు. అయితే.. గత రెండు రోజులుగా సందీప్‌పై ఓ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో సందీప్ నటిస్తున్నాడని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నదని వార్తలు వినిపించాయి. ఈ సినిమాకి సందీప్ నిర్మాతగానూ వ్యవహరిస్తాడని చెప్పుకున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని సందీప్ కిషన్ తేల్చేశాడు. అసలు తన దగ్గరకు అలాంటి ప్రపోజల్ ఏమీ రాలేదని, అలాంటి కథలేవీ ఎవరూచెప్పలేదని, ప్రస్తుతం బయోపిక్‌లు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పేశాడు. సో... ఉదయ్ కిరణ్ బయోపిక్ వార్తలో ఎలాంటి నిజం లేదన్నమాట. సందీప్ `ఏ1` కసరత్తుల్లో ఉన్నాడు. ఈ సినిమాకి తనే నిర్మాత. హాకీ నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకోసం ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. ఈలోగానే ఉదయ్ కిరణ్ బయోపిక్ వార్త బయటకు వచ్చింది.