టాలీవుడ్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న సంగీత దర్శకుడు తమన్. తన కెరీర్‌లో దాదాపు అగ్ర హీరోలందరి సినిమాలకూ పని చేశాడు. ఒక్క పవన్ కల్యాణ్ కి తప్ప. ఇప్పుడు ఆ లోటు తీరబోతోంది. త్వరలోనే పవన్ - తమన్ కాంబోలో ఓ మ్యూజిక్ ఆల్బమ్ రాబోతోంది. పింక్ రీమేక్‌లో పవన్‌కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. సంగీత బాధ్యతల్ని తమన్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో పాటలకు పెద్దగా స్కోప్ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం. తమన్ అయితే ఈ కథకు న్యాయం చేస్తాడని చిత్రబృందం భావిస్తోందట. దాంతో పాటు తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా ఒకట్రెండు పాటల్ని కంపోజ్ చేసే అవకాశం ఉంది. 2020 జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.