‘మోసగాళ్లు’ నుండి ఎ.సి.పి కుమార్‌.!

మరిన్ని వార్తలు

మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమా నుండి బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. మొన్నా మధ్య ‘అను’ అంటూ రిలీజ్‌ చేసిన కాజల్‌ అగర్వాల్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు సునీల్‌ శెట్టి లుక్‌ కూడా చాలా బావుందని మాట్లాడుకుంటున్నారు. తలపాగా చుట్టుకుని, సింగ్‌ పోలీసాఫీసర్‌లా సునీల్‌ శెట్టి కనిపిస్తున్నారు. ‘ఎ.సి.పి కుమార్‌’ అని ఆయన పాత్ర పేరును పరిచయం చేశారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అయిన సునీల్‌ శెట్టి తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రమిది. గతంలో ఓ తమిళ చిత్రంలో నటించి మెప్పించారాయన.

 

ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం సునీల్‌ శెట్టి ఎంపిక ఎంత యాప్ట్‌ అనేది ఈ లుక్‌తోనే అర్ధమైపోతోంది. ఇక వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి జెఫ్రీ జి.చిన్‌ దర్శకుడు. యంగ్‌ హీరోలు నవదీప్‌, నవీన్‌ చంద్ర లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్‌లో రిలీజ్‌కి ముస్తాబవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్స్‌తో ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే కంటెంట్‌ కూడా ఉత్కంఠభరితంగా ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు. యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుత రాజకీయాల్లోని కొన్ని కీలక పరిస్థితును ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. చూడాలి మరి, ‘మోసగాళ్లు’ అసలు విషయమేంటో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS