మంచి టైమింగ్ ఉన్న కామెడీకి సునీల్ పెట్టింది పేరు. కమెడియన్‌గా తన స్థాయి ఓ రేంజ్లో ఉన్న సమయాన హీరోగా అవకాశాలు వెతుక్కోవడం, అదృష్టం కలిసొచ్చి ‘అందాల రాముడు’ సినిమాతో హీరో అయిపోవడం, తర్వాత ‘మర్యాద రామన్న’తో సూపర్ డూపర్ హిట్ కొట్టేయడం.. ఆ తర్వాత వరుసగా రెండు మూడు హిట్ సినిమాలు సునీల్‌ని హీరోగా బాగానే నిలబెట్టేశాయి. అయితే, ఆ తర్వాత నుండి కెరీర్ నెమ్మది నెమ్మదిగా నిమ్మలించడంతో హీరోగా ప్రయత్నించీ ప్రయత్నించీ విరమించుకున్నాడు సునీల్. ఇక తనకు కామెడీనే కరెక్ట్ అనుకున్నాడో ఏమో, మళ్లీ కమెడియన్ అవతారమెత్తేశాడు.
అయితే, గతంలో మాదిరి సునీల్‌కి టైమింగ్ ఉన్న క్యారెక్టర్స్ పడడం లేదు. ఒకవేళ పడినా, పండడం లేదు. దాంతో ఇటు హీరోకీ కాక, అటు కమెడియన్కీ కాక మధ్యలో ఇరుక్కుపోయాడు సునీల్. కానీ ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా నిలబడాన్న కసి, ఇప్పుడు సునీల్‌ని విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. సునీల్ తాజా చిత్రం ‘కలర్ ఫోటో’ నుండి ఇటీవల ఓ ఫస్ట్‌లుక్ రిలీజైన్ సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సునీల్ ఫుల్ లెంగ్త్ విలన్‌గా కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది. వర్ధమాన కమెడియన్ సుహాన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, సునీల్ పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో ఉండబోతోందట. ఒకవేళ సునీల్ విలనిజమైనా కరెక్ట్‌గా పండితే, టాలీవుడ్లో మరి కొన్నాళ్లు కొత్త విలన్‌గా సెటిలైపోవచ్చునన్న మాట.