అల్లు అర్జున్ పుష్షరాజ్ గా అలరించడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీ- సుక్కు కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. విజయ్ సేతుపతిని ముందు విలన్ గా అనుకున్నారు. ఆ తరవాత... బాబీ సింహా పేరు గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు పుష్షలో సునీల్ విలన్ గా కనిపించబోతున్నాడని టాక్.
ఇటీవల `కలర్ ఫొటో`లో విలన్ గా అలరించాడు సునీల్. తనలో ఈ రకమైన యాంగిల్ కూడా ఉందని .. ఈ సినిమాతో అర్దమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సునీల్ భిన్నమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నాడు. నెగిటీవ్ టచ్ ఉన్న పాత్రలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. సుకుమార్ కూడా.. సునీల్ ని విలన్ గా పెట్టుకుంటే బాగుంటుందని భావిస్తున్నాడట. సునీల్ తో చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపేసిందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.