సెకెండ్ ఇన్నింగ్ లో సునీల్ జోరు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అటు వెబ్ మూవీస్ ని కూడా ఒప్పుకుంకుంటున్నాడు. సునీల్ చేస్తున్న దాదాపు అరడజను సినిమాలు సెట్స్ పై వున్నాయి. పుష్పలో 'మంగళం శ్రీను' లాంటి విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ ఈవారం విడుదల కాబోతున్న పుష్పక విమానంలో పోలీస్ పాత్ర.
ఇప్పుడు జర్నలిస్ట్ పాత్రని కూడా కవర్ చేశాడు సునీల్. ఆది - పాయల్ రాజ్ పుత్ జోడిగా 'తీస్ మార్ ఖాన్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడు సునీల్. మామూలు జర్నలిస్ట్ కాదు.. సునీల్ పాత్ర రూపంలో కథలో ట్విస్ట్ వుంటుందని, ఆ ట్విస్ట్ సినిమాకి కీలక మలుపు అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా వుంది. నాటకం ఫేం కళ్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.