సునీల్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇప్పుడే.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సునీల్‌, 'అందాల రాముడు' సినిమాతో హీరో అవతారమెత్తాడు. కమెడియన్‌గా సునీల్‌కి దక్కిన అభిమానం అంత కాకపోయినా, ఓ మోస్తరు అభిమానం హీరోగానూ ఆయనపై చూపించారు. కానీ హీరోగా తన స్టామినాని నిలబెట్టుకోలేకపోయాడు సునీల్‌. 

దాంతో కాస్త టైం తీసుకున్నా, ఎక్కువ టైం వేస్ట్‌ చేయకుండా మళ్లీ గతంలోకి వెళ్లిపోయాడు సునీల్‌. 'సిల్లీ ఫెలోస్‌'లో అల్లరి నరేష్‌తో కలిసి నటించాడు. ఆ తర్వాత 'అరవింద సమేత'లో కనిపించిన సునీల్‌ కమెడియన్‌గా అయితే ఆకట్టుకోలేకపోయాడు కానీ, ఇంపార్టెంట్‌ రోల్‌ కాబట్టి, ఓకే. 

ఇకపోతే అసలు సిసలు కమెడియన్‌ పాత్ర అంటే త్వరలో రాబోతున్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమానేనట. శీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సునీల్‌ కామెడీతో కడుపుబ్బ నవ్విస్తాడట ఇది ఫిక్స్‌ అంటున్నారు. గతంలో 'సొంతం' తదితర చిత్రాల్లో శీనువైట్ల దర్శకత్వంలో సునీల్‌ తన మార్క్‌ కామెడీతో అలరించాడు. అదే మార్క్‌తో ఇప్పుడు మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు. సునీల్‌ ఫ్యాన్స్‌ని పిచ్చ హ్యాపీ చేస్తాడట ఈ సినిమాలో తన పాత్రతో. 

ఇదిలా ఉంటే, సునీల్‌ కోసం చాలా చాలా క్యారెక్టర్లు రెడీగా ఉన్నాయి. హీరోగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న సునీల్‌ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అందుకే లేటెస్టుగా జరిగిన 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి కూడా సునీల్‌ హాజరు కాలేకపోయాడు. కానీ ఈ సినిమాలో సునీల్‌ పాత్ర గురించి డైరెక్టర్‌ శీను వైట్ల చాలా గొప్పగా ప్రస్థావించాడు. 

రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కుతోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS