'సిల్లీ ఫెలోస్‌' డబుల్‌ ధమాకా అవుతుందా?

మరిన్ని వార్తలు

అల్లరోడి కామెడీకి పరిచయం అక్కర్లేదు. అలాగే భీమవరం బుల్లోడి టైమింగ్‌కి కూడా. అయితే ఈ ఇద్దరికీ ఇప్పుడు టైం అస్సలు కలిసి రావడం లేదు సోలోగా. అందుకే ఏమనుకున్నారో ఏమో కానీ, తమ పాత టైమింగ్‌నే నమ్ముకుని ఒకేసారి ఇద్దరూ కలిసి ఎంటర్‌టైన్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. 'సిల్లీ ఫెలోస్‌' అంటూ కామెడీ టైటిల్‌తో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ నేపథ్యంతో వస్తున్నారు. 

'సుడిగాడు' సినిమాతో పిచ్చ పిచ్చగా ఎంటర్‌టైన్‌ చేయడంతో పాటు, అల్లరి నరేష్‌ కెరీర్‌లోనే మంచి విజయం అందించిన భీమినేని శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది 'సిల్లీ ఫెలోస్‌'. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో బాగా అని చెప్పలేం కానీ, ఓ మోస్తరుగా ఎట్రాక్ట్‌ చేస్తున్నారు అల్లరి నరేష్‌, సునీల్‌. ట్రైలర్‌ని బట్టి తీసుకున్న టికెట్‌కి న్యాయం చేస్తారేమో ఈ సిల్లీ ఫెలోస్‌ అనే నమ్మకం కలిగించారు కానీ, ఏమో చెప్పలేం మరి. అయితే ఈ సినిమాకి పెద్దగా పోటీ కూడా ఏం లేదనే చెప్పాలి. 

ప్రముఖ కమెడియన్‌ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్‌ హీరోగా నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'మను' కూడా ఇదే రోజు రిలీజ్‌ అవుతోంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్‌, 'సిల్లీ ఫెలోస్‌' పెద్దగా పోటీ కాకపోవచ్చు. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయి కానీ అవేమీ చెప్పుకోదగ్గ చిత్రాలు కావు. 

సో ఏమాత్రం పోజిటివ్‌ టాక్‌ వచ్చినా 'సిల్లీ ఫెలోస్‌'ని ఫస్ట్‌వీక్‌ వరకూ ఎంజాయ్‌ చేసే అవకాశాలు లేకపోలేవు. ఎందుకంటే సెకండ్‌ వీక్‌ నాటికి మారుతి - చైతూ కాంబోలో 'శైలజారెడ్డి అల్లుడు' పోటీకొచ్చేస్తాడు మరి. చూడాలి మరి ఈ 'సిల్లీ ఫెలోస్‌' చేయబోయే కామెడీ రచ్చ సక్సెస్‌ అవుతుందో లేదో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS