సంచలన దర్శకుడితో సాయి పల్లవి సినిమా?

By iQlikMovies - March 25, 2018 - 13:44 PM IST

మరిన్ని వార్తలు

సాయి పల్లవి- బహుశా ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఎవరు ఉండరు అని అనడంలో అతిశయోక్తి కాదేమో. ఆమె నటనే ఆమెకి ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చి పెట్టింది.

ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో ఒక కొత్త చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకి ఆ కథ చెప్పింది ఒక కొత్త దర్శకుడు. ఆ కొత్త దర్శకుడు మరెవరో కాదు- నీది నాది ఒకే కథ తీసిన వేణు. ఈ దర్శకుడు చెప్పిన స్టొరీ లైన్ ఆమెకి నచ్చడంతో వెంటనే పచ్చ జెండా ఊపిందట.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినా తొలిచిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే మరొక చిత్రం దాదాపుగా ఒకే అవ్వడంతో వేణుకి దర్శకుడిగా బ్రేక్ వచ్చిందనే చెప్పాలి.

ఇదిలావుండగా ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో హీరో సూర్య తో కలిసి ఒక భారీ చిత్రంలో నటిస్తున్నది, ఆ చిత్రం తెలుగు-తమిళంలో ఒకేసారి విడుదలవ్వనుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS