హాస్య నటుడు సునీల్ వేదాంతం రాఘవయ్యగా మారుతున్నాడు. 14 రీల్స్ సంస్థ సునీల్ కథానాయకుడిగా ఓ సినిమా నిర్మిస్తోంది. దీనికి.. `వేదాంతం రాఘవయ్య` అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథని అందించడం విశేషం. ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు.
14 రీల్స్‌ల ఓ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన `గద్దల కొండ గణేష్` మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి పని చేస్తున్నప్పుడే.. హరీష్ ఈ లైన్ చెప్పాడట. అది 14 రీల్స్‌కి బాగా నచ్చింది. సునీల్ అయితే హీరోగా బాగుంటాడని తననే హీరోగా ఎంచుకున్నారు. దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.