సన్నీలియోన్‌ ఆ విషయంలో నువ్వే టాప్‌

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. నిజానికి సన్నీలియోన్‌లో ఇండియన్‌ మూలాలున్నప్పటికీ, ఆమె పుట్టి పెరిగిన వాతావరణం దృష్ట్యా ఆమె ఎంచుకున్న రంగం తప్పుపట్టేది కాదు. అయినా కానీ ఆ రంగంలో సన్నీలియోన్‌ ఓ స్థాయికి చేరుకున్నాక పూర్తిగా ఆ పోర్న్‌ రంగాన్ని విడిచి పెట్టి, బాలీవుడ్‌ సినిమా రంగం వైపు దృష్టి సారించింది. 

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ స్థాయికి ఎదిగాక చక్కగా పెళ్లి చేసుకుంది. వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడితో ఆగలేదు. ముగ్గురు పిల్లలకు జన్మనివ్వకపోయినా తల్లిగా మారి, ఆదర్శ మహిళ అనిపించుకుంటోంది. ఇలా ఆమె వచ్చిన వృత్తి ఇబ్బందికరమైనదే అయినా కానీ, ఆ తర్వాత ఆమె నడుస్తున్న దారికి అందరి ప్రశంసలు అందుకుంటోంది. తన పిల్లల విషయంలో ఎంతో బాధ్యత గల తల్లిగా వ్యవహరిస్తోంది. 

'పోర్న్‌ రంగం నుండి వచ్చిన నేను ఆ టైంలో ఎన్నో కష్ట నష్టాలు, అసభ్యకరమైన కామెంట్లు ఎదుర్కొన్నాను. తల్లితండ్రుల నుండి కూడా మొదట్లో వ్యతిరేకత ఏర్పడింది. కానీ తర్వాత వారు అర్ధం చేసుకున్నారు. నా జీవితం ఎలా ఉన్నా నన్ను నేను ప్రేమిస్తాను. కానీ నా పిల్లల విషయంలో అలా జరగకూడదనీ..' అంటోంది సన్నీలియోన్‌. 'నేను ఎదుర్కొన్న కష్టాలు నా పిల్లలు పడకూడదు. వారి జీవితం స్వేఛ్చగా ఉండాలి..' అని పిల్లల విషయంలో సన్నీలియోన్‌ ఆలోచిస్తున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 

తెరపై సన్నీలియోన్‌ జీవితం వేరు. తెర వెనుక సన్నీ జీవితం వేరు. తనకింతటి అభిమానాన్ని పంచిన ఈ దేశం కోసం ఎప్పుడూ తానేదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే పలు సేవాకార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటుంది సన్నీ. అందుకే సన్నీ రియల్‌ లైఫ్‌ ఆటిట్యూడ్‌కి ఎలాంటి వారైనా ఫిదా కావల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS