సన్నీలియోన్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా ఇప్పటికే విడుదల చేసిన విషయం విదితమే. అయితే, సినిమాగా సన్నీలియోన్ జీవిత చరిత్రను తెరకెక్కించాలనే డిమాండ్ ప్రముఖంగా విన్పిస్తుండడంతో, త్వరలో ఆ దిశగా సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట.
సన్నీలియోన్ అంటే ఒకప్పుడు అడల్ట్ స్టార్. ఎన్నో పోర్న్ సినిమాల్లో నటించిందామె. భారతీయ మూలాలున్నప్పటికీ విదేశాల్లో పుట్టి పెరిగిన సన్నీలియోన్, పోర్న్ కెరీర్‌ని 'తప్పు'గా ఎప్పుడూ భావించలేదు. ఇప్పటికీ, ఆమె నోట 'పోర్న్ కెరీర్ తప్పు' అనే మాట రాదు. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి వచ్చాక సన్నీలియోన్, పోర్న్ సినిమాల వైపు వెళ్ళలేదు. అలాగని, పోర్న్ కెరీర్ పట్ల తనకేమీ రిగ్రెట్స్ లేవని పదే పదే చెబుతుంటుంది ఈ మాజీ పోర్న్ స్టార్. నిజానికి తొలుత తన బయోపిక్‌ని వెండితెరపై చూసుకోవాలని సన్నీలియోన్ అనుకున్నా, తన జీవితంలోని 'పోర్న్' కోణానికి వెండితెర నిబంధనలు అడ్డుగా మారతాయేమోనని భావించి, వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పింది.
అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. పోర్న్ కెరీర్‌ని తెరకెక్కించినా, అందులో పోర్న్ దృశ్యాలు వుండాల్సిన పనిలేదు కాబట్టి, ఆ ఫ్లేవర్ వచ్చేలా 'ఎ' సర్టిఫికెట్‌తో సినిమా వచ్చినా ఫర్లేదని సన్నీలియోన్ భావిస్తుందట. ప్రస్తుతం దర్శకుడి అన్వేషణలో వున్నారట సన్నీలియోన్ దంపతులు. వెబ్ సిరీస్‌లా పార్టులు పార్టులుగా కాకుండా రెండున్నర గంటల నిడివిలో సాధారణ సినిమాగానే తన జీవితాన్ని తెరకెక్కిస్తే బావుంటుందన్నది సన్నీలియోన్ అభిమతంగా కన్పిస్తోంది.
బాలయ్యం, పోర్న్ కెరీర్, బాలీవుడ్ సినిమాలు, సంతానం.. ఇలా ముఖ్యమైన ఘట్టాలు ఈ సినిమాలో వుంటాయట.