మొగుడ్ని ముద్దాడితే తప్పేంటట? అని సన్నీలియోన్ ప్రశ్నిస్తోందిగానీ.. ఆ ముద్దులాటకు సందర్భం లేకపోతే ఎలా? వినాయక చవితి పర్వదినాన సన్నీలియోన్, ముంబైలోని సొంతింట్లోకి వెళ్ళింది. తాను సొంతిల్లు కొనుక్కున్న విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ క్రమంలో ఆమె చేసిన 'వెకిలి చేష్టలు' జుగుప్సాకరంగా వున్నాయంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులతోపాటు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సన్నీలియోన్‌ని ఆమె భర్త డేనియల్ వెబర్ ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇద్దరూ లిప్ టు లిప్ కిస్ లాగించేశారు.. అదీ సన్నీలియోన్, డేనియల్ వెబర్ చేతుల్లో 'ఎత్తుకుని' వున్నప్పుడే. హౌ రొమాంటిక్.. అని కొందరు అనుకుంటోంటే, వినాయక చవితి పర్వదినాన ఇదేమి పైత్యం? అని ప్రశ్నిస్తున్నారు.
వినాయక చవితి రోజున ఇలా చేయొచ్చో లేదో నాకు తెలియదుగానీ.. అంటూ కొత్తింటిని జనానికి పరిచయం చేస్తూ, మూతి ముద్దు అనే 'కోతి వేషాలు' వేయడంతో సన్నీలియోన్ వివాదాస్పదమయ్యింది. వివాదాలు ఆమెకు కొత్త కాదు. ఎలాగోలా పబ్లిసిటీ సంపాదించడమూ ఆమెకు అలవాటే.
పోర్న్ స్టార్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్‌కి లిప్ టు లిప్ కిస్ చాలా చిన్న విషయం. పైగా అది భర్తతో లిప్ కిస్. కానీ, పండగ - పబ్బం చూసుకోకుండా ఈ రొమాన్స్ ఏంటన్నదే జనాలు సంధిస్తున్న ప్రశ్న.